Independence Day 2022: అంతరిక్ష కేంద్రంలో త్రివర్ణ పతాక రెపరెపలు.. ఆవిష్కరించిన మన హైదరాబాదీ
Independence Day 2022: భారత దేశ స్వాతంత్ర్య వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా భారత జెండా రెపరెపలాడుతోంది. విదేశాల్లో ఉన్న భారతీయులు జెండా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
Independence Day 2022: భారత దేశ స్వాతంత్ర్య వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. దేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ను ఏడాది పొడవునా నిర్వహిస్తోంది కేంద్ర సర్కార్. ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా పిలుపుతో దేశంలోని ప్రతి ఇల్లు త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా భారత జెండా రెపరెపలాడుతోంది. విదేశాల్లో ఉన్న భారతీయులు జెండా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ భక్తిని చాటుకుంటున్నారు.
ఇండిపెండెన్స్ డే వజ్రోత్సవాల సందర్భంగా ఇండియన్ నేవీ ఆరు ఖండాలకు ప్రత్యేకంగా నౌకలను పంపించి స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా అమెరికాలోని ప్రముఖ టెస్ట్ పైలట్ గా ఉన్న వ్యోమగామి రాజాచారి ఆసక్తికర ఫొటోలు ట్వీట్ చేశారు. ‘‘ఇండియా ఇండిపెండెన్స్ డే వేళ ప్రవాస భారతీయుడిగా నా తండ్రి నగరమైన హైదరాబాద్ ఎలా వెలిగిపోతోందో అంతరిక్షం నుంచి వీక్షిస్తున్నా. భారత అమెరికన్లు నిత్యం పురోగమిస్తోన్న వాటిల్లో నాసా కూడా ఒకటి’’ అని రాజాచారి ట్వీట్ చేశారు. నాసా అంతరిక్ష కేంద్రంలో భారత దేశ జాతీయ జెండాను ఆవిష్కరించిన ఫొటోలను హైదరాబాదీ రాజాచారీ షేర్ చేశారు. ఈ ఫోటోల్లో అంతరిక్ష కేంద్రంలో త్రివర్ణ పతాకం వెలిగిపోతోంది.
Read Also: CM Jagan: మీడియా కొందరికి భజన చేస్తుందని సమరయోధులు ఊహించారా? జెండా పండుగలో సీఎం జగన్ ప్రశ్న..
Read Also: Tirumala: భక్తులకు 40 గంటలు.. మంత్రి అనుచరులకు నిమిషాల్లో దర్శనం! తిరుమలలో వైసీపీ నేతల దౌర్జన్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook