కూలిన హెలికాఫ్టర్.. పైలెట్ మృతి
గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా ముంద్రా వద్ద మంగళవారం ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలింది.
గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా ముంద్రా వద్ద మంగళవారం ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలింది. ముంద్రా వద్ద పొలాల్లో హెలికాప్టర్ కూలిన ఘటనలో పైలట్, ఎయిర్ కమాండర్ సంజయ్ చౌహాన్ మృతి చెందారు. ముంద్రా వద్ద పొలాల్లో జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. శిక్షణలో భాగంగా జామ్‌నగర్ నుంచి వెళ్లిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.