జోధ్‌పూర్: భారత వాయుసేనకు చెందిన మిగ్-27 యుద్ధ విమానం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌కు 120 కిమీ దూరంలో ఆదివారం ఉదయం కూలిపోయింది. ఎప్పటిలాగే రోజువారి విధులలో భాగంగా టేకాఫ్ అయిన విమానం ఆ తర్వాత కొద్దిసేపటికే జోధ్‌పూర్‌కి దక్షిణాన కుప్పకూలింది. అదృష్టవశాత్తుగా ప్రమాదం జరిగిన సమయంలో అప్రమత్తమైన పైలట్.. విమానంలోంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఘటనాస్థలిలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"177740","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


యుద్ధ విమానం కూలిపోయిన ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించినట్టు వాయిసేన అధికార వర్గాలు పేర్కొన్నాయి.