IED in Delhi:  దేశ రాజధాని ఢిల్లీలో ఐఈడీ బాంబు కలకలం రేపింది. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ పూల మార్కెట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన బ్యాగులో ఐఈడీ బాంబును గుర్తించారు. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ టీమ్ అక్కడికి చేరుకుని ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. కాసేపటికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) బృందం అక్కడికి చేరుకుని ఐఈడీ బాంబును నిర్వీర్యం చేసింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఢిల్లీలో తీవ్ర కలకలం రేపుతోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఈడీని నిర్వీర్యం చేసేందుకు ఎన్‌ఎస్‌జీ టీమ్ నియంత్రిత పేలుడును నిర్వహించింది. దీంతో ఆ ప్రాంతం భారీ శబ్ధంతో ఉలిక్కిపడగా.. పొగ కమ్ముకుపోయింది. ఐఈడీని గుర్తించిన వెంటనే.. ఆ మార్కెట్ ప్రదేశాన్ని ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లో కేసు నమోదు కాగా.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.


దర్యాప్తులో భాగంగా స్పెషల్ సెల్ పోలీసులు స్థానికంగా అమర్చిన 15 సీసీటీవీ కెమెరాల నుంచి ఫుటేజీని సేకరించారు. ఫుటేజీని పరిశీలిస్తే ఈ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, పేలుడు పదార్థాలను ఎన్‌ఎస్‌జీ టీమ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించింది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా మాట్లాడుతూ.. ఆ ప్రదేశంలో ఎలాంటి పేలుడు చోటు చేసుకోలేదన్నారు. ఐఈడీని స్వాధీనం చేసుకోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.


కాగా, రిపబ్లిక్ డే సమీపించడం.. వచ్చే నెల నుంచి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (Five State Assembly Election 2022) జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఇటీవలే ఇంటలిజెన్స్ విభాగం అక్కడి పోలీసులను అలర్ట్ చేసింది. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.


Also Read: Lesbian Marriage : ఇంట్లో నుంచి పారిపోయి... పెళ్లితో ఒక్కటైన ఆ లెస్బియన్ జంట...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook