Ghosts Existance: దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా లేవా అనే అంశంపై ఇంకా ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతూనే ఉంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ డైరెక్టర్ దెయ్యాలున్నాయని చెప్పడం వివాదాస్పదమైంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ స్నేహితుడి ఇంట్లో దెయ్యాలు, ఆత్మలు ఆవహించడం, వాటిని తరిమికొట్టేందుకు మంత్రాల ఉచ్ఛరించడం..ఈ అనుభవాల్ని పంచుకుంటూ ఐఐటీ మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బెహరా విడుదల చేసిన వీడియా వివాదాస్పదమైంది. లెర్న్ గీతా లైవ్ గీతా అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఆ తరువాత ఆ వీడియోను ప్రైవేట్ చేసేశారు. 


5 నిమిషాలున్న ఆ వీడియోలో..1993లో తాను చెన్నైలోని ఓ స్నేహితుడి ఇంటికి ఎలా వెళ్లాడు, ఎలా దెయ్యాల బారిన పడిన ఆ కుటుంబాన్ని విడిపించాడనే వివరాల్ని క్షుణ్ణంగా వివరించారు లక్ష్మీధర్ బెహరా. హరే రామ, హరే కృష్ణ నామస్మరణ చేస్తూ..భగవద్గీతను పఠించడం ప్రారంభించారట లక్ష్మీధర్ బెహరా (Laxmidhar Behera). ఆ పవిత్ర పేరుకున్న శక్తితో తన స్నేహితుడిని రక్షించాలని నిర్ణయించుకున్నట్టు బెహరా తెలిపారు. 


అందుకే మరో ఇద్దరు స్నేహితుల్ని వెంటబెట్టుకుని సాయంత్రం 7 గంటలకు ఆ ఇంటికి చేరుకున్నారట. అతడొక రీసెర్చ్ స్కాలర్ . దాదాపు 10-15 నిమిషాలసేపు గట్టిగా పఠించిన తరువాత..అక్కడ జరిగిన ఘటన బెహరా, అతడి స్నేహితుల్ని ఆశ్చర్యపర్చింది. పొట్టిగా ఉండి..సరిగ్గా నడవలేని వృద్ధుడైన తన స్నేహితుడి తండ్రి ఒక్కసారిగా కాళ్లు, చేతులు ఆడిస్తూ దారుణమైన డ్యాన్స్ చేయడం ప్రారంభించారట. అంతేకాదు ఆ సమయంలో అతడి తల ఆ ఇంటి కప్పును తాకిందట. అంటే పూర్తిగా అతడు ఈవిల్ స్పిరిట్స్ వశంలోకి వచ్చేశాడు. తన స్నేహితుడి తండ్రితో పాటు స్నేహితుడి తల్లి, భార్య కూడా దెయ్యాల బారిన పడ్డారని బెహరా చెప్పుకొచ్చారు. ఆ దెయ్యాల్ని తరిమి కొట్టడానికి దాదాపు గంట సమయం పట్టిందన్నారు. 


అక్కడ జరిగిందే చెప్పానని బెహరా చెప్పారు. దెయ్యాలున్నాయని ధృవీకరించారు. మనచుట్టూ జరిగే చాలా రకాల సంఘటనల్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానం చెప్పలేకపోతుందని కూడా బెహరా తెలిపారు. బెహరా ఇంతకుముందు కాన్పూర్ ఐఐటీలో సేవలందించారు. మండి ఐఐటీకు (IIT Mandi) డైరెక్టర్‌గా జనవరి 13న నియమింపబడ్డారు. విశేషమేమంటే ఈ ఐఐటీ ప్రొఫెసర్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నిపుణుడు కావడం. ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్‌డీ తీసుకున్న డాక్టర్ బెహరా..జర్మన్ నేషనల్ సెంటర్ ఫర్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి పోస్ట్ డాక్టోరల్ డిగ్రీ కూడా అందుకున్నారు. ఇంతలా చదువుకున్న బెహరా దెయ్యాలు, ఆత్మలున్నాయని చెప్పడమే కాకుండా..ఎక్కడైనా ఉంటే వేదమంత్రాల ద్వారా తరిమి కొట్టవచ్చని పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. 


Also read: Oldest Whisky: ఆ మందు బాటిల్ ఖరీదు 4 కోట్ల రూపాయలు, వేలంలో అత్యధిక ధర


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook