IIT Roorkee: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ విద్యను అందించే దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థ. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులతో విద్యార్ధుల్ని తీర్దిదిద్దుతోంది. ఐఐటీ రూర్కి ఇప్పుడు కొత్తగా 7 కోర్సుల్ని ప్రారంభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సుల్ని తయారు చేయడమే కాకుండా అందులో విద్యార్ధుల్ని తీర్దిదిద్దడం చాలా ముఖ్యం. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ(IIT) కళాశాలల్లో ఇదే జరుగుతుంది. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కి(IIT Roorkee) కొత్తగా 7 కోర్సుల్ని తయారు చేసింది. 2021-22 విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులో ఉంటాయని ఐఐటీ రూర్కి ప్రకటించింది. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఎకానమిక్స్-మేనేజ్‌మెంట్, డేటా సైన్స్-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఈ కొత్త కోర్సుల్ని డిజైన్ చేశారు. 


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)విభాగంలో ఎంటెక్, డేటా సైన్స్ విభాగంలో ఎంటెక్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజైన్ విభాగంలో డేటా సైన్స్, ఇండస్ట్రియల్ డిజైన్‌లో ఎంటెక్, మాస్టర్ ఇన్ ఇన్నోవేషన్ మేనేజ్‌మెంట్‌లో ఎంఐఎం, ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎంటెక్, సోషల్ జస్టిస్ విభాగంలో ఎంఎస్ ఎకనామిక్స్, హైడ్రాలజీ విభాగంలో ఎంటెక్ కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లో రానున్నాయి. 


Also read: కర్ణాటక కొత్త మంత్రిమండలి జాబితా రేపు విడుదల, అధిష్టానంతో సీఎం సమావేశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook