AP TS Weather Updates: రెండ్రోజుల క్రితం మే 19న అండమాన్ నికోబార్ దీవుల్ని తాకిన రుతుపవనాలు క్రమంగా వ్యాపిస్తున్నాయి. రానున్న రెండ్రోజుల్లో ఆగ్నేయ అరేబియా, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ ఇతర ప్రాంతాలకు ఆవహించనున్నాయి. దీనికి తోడుగా దక్షిణ కోస్తా తమిళనాడు ప్రాంతాలపై ఆవహించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటన్నింటికీ తోడు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు


వాతావరణంలో జరుగుతున్న ఈ మార్పుల కారణంగా రానున్న మూడ్రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని మండలాల్లో వడగాలులు వీయవచ్చు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాలు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 28 మండలాల్లో ఇవాళ వడగాలులు వీయవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 6, పార్వతీపురం మన్యం జిల్లాలో 12, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 మండలాల్లో వేడిగాలులు వీస్తాయి. నిన్న రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో అత్యధికంగా 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో 3.8, కోనసీమ జిల్లా మండపేటలో 3.3, కొత్తవలసలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు


బంగాళాఖాతంలో రేపు మే 22న అల్పపీడనం ఏర్పడనుంది. ముందుగా వాయువ్య దిశలో కదిలి తరువాత  24వ తేదీనాటికి వాయగుండంగా బలపడనుంది. ఫలితంగా రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని హైదరాబాదా్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, అదిలాబాద్, ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, భువనగిరి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.  కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. నిన్న కూడా రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. 


Also read: Summer Tourism Tips: వేసవిలో ఈ 6 పర్యాటక ప్రాంతాల సందర్శన నరకమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook