Heat Waves Alert: ఏపీ, తెలంగాణలో వడగాలుల అలర్ట్ జారీ, తస్మాత్ జాగ్రత్త
Heat Waves Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఎండలు ఈసారి భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heat Waves Alert: వేసవి రోజురోజుకూ తీవ్రమౌతోంది. ఎండల తీవ్రత పెరుగుతోంది. మరో వారం రోజులు ఎండల తీవ్రత పెరగడంతో పాటు వడగాలులు కూడా వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు ఈశాన్య భారతదేశంలో మాత్రం వర్ష సూచన జారీ అయింది.
ఈసారి వేసవి అత్యంత తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. రాయలసీమ, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాలు, తూర్పు మధ్య ప్రదేశ్‌లోని కొన్ని చోట్లు రానున్న మూడ్రోజులు వడగాల్పులు వీయనున్నాయి. దేశమంతా వచ్చే వారం రోజులు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండనుంది. ఏప్రిల్ 5వ తేదీ వరకూ ఉత్తర కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో వడగాలులు వీయవచ్చు. అదే విధంగా మహారాష్ట్ర, ఒడిశా ప్రాంతాల్లో రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే రాత్రి 9 గంటల వరకూ వేడి గాలులుంటాయి.
మొత్తానికి దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో విపరీతమైన వేడి ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. సాధారణం కంటే 3-4 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు కానుంది. ఇక వడగాల్పులు కూడా సాదారణం కంటే ఎక్కువగా ఉండవచ్చు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఏపీ రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం వచ్చే రెండ్రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు.
Also read: Indian Air Force: చైనా-పాక్‌కు దీటైన సమాధానమిచ్చే వాయుసేన అభ్యాసనం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook