Assam Floods: భారీ వర్షాలు అసోంను అతలాకుతలం చేస్తున్నాయి.  ఆ రాష్ట్రంలోని అనేక జిల్లాలు వరదనీటిలో మునిగిపోయాయి. దాదాపు 29 జిల్లాల్లో వరద ప్రభావం స్పష్టం కనిపిస్తోంది. అసోం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మే(19) అర్ధరాత్రి వరకు.. వరదల ప్రభావం దాదాపుగా 7 లక్షల 17వేల మందిపై పడిందని ప్రకటించింది. అటు వరదలతో మృతుల సంఖ్య 9కి చేరినట్టు తెలిపింది. రాష్ట్రంలోని 1413 గ్రామాలు నీటమునిగినట్టు ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వరదల ధాటికి నాగన్‌ జిల్లా పూర్తిగా దెబ్బతిన్నట్టు ప్రకటించింది. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపుగా 3 లక్షల మంది వరకు నిరాశ్రయులైనట్టు తెలిపింది. అటు సచార్‌ జిల్లాలో లక్షా 20 వేల మంది, హోజయ్‌ లో లక్షా 7 వేల మంది వరద ప్రభావానికి గురయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ వరదల నేపథ్యంలో అసోంలో ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అసోం రైఫిల్స్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బాధితులను పునరావస కేంద్రాలకు తరలిస్తున్నాయి.  ఇండియన్‌ ఆర్మీ సైతం రంగంలోకి దిగి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత స్పీడప్‌ చేస్తోంది. వరదల నేపథ్యంలో అత్యవసరంగా భేటీ అయిన అసోం రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలవారిని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించాలని నిర్ణయించింది. అందులోభాగంగా విమాన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సిలిచర్‌, గౌహతి మధ్య మూడు వేల రూపాయలకే సర్వీసులు అందిస్తోంది. దిమా హసావో, బరాక్ వ్యాలీలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మరోవైపు సచార్‌ జిల్లా యంత్రాంగం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవాళ్టి వరకు సెలవులు ప్రకటించింది.



 


 


 



వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇస్తున్నారు. అసోం రాష్ట్ర హౌజింగ్‌, పురపాలకశాఖ మంత్రి అశోక్‌ సింఘాల్‌.. సచార్‌ జిల్లాలో పర్యటించారు. అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. ఈశాన్య ఫ్రంటీయర్‌ రైల్వే ముందస్తుగా పలు రైళ్లను రద్దు చేసింది. లంబ్డింగ్‌ బర్దార్‌ పూర్‌ మధ్య నడిచే అన్ని రైళ్లను బంద్‌ చేసింది. అటు త్రిపుర, మిజోరం, మణిపూర్‌ లకు వెళ్లే రైల్వే ట్రాక్‌ లు కూడా వరదలధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిని రైల్వే సిబ్బంది మరమ్మతు చేస్తున్నారు.


Also Read: Jr NTR fans:జూనియర్ ఎన్టీఆర్ ఇంటిదగ్గర అభిమానుల రచ్చ.. పోలీసుల లాఠీఛార్జ్


Also Read: Facebook Compensation: పది లక్షలకు పైగా యూజర్లకు 30 వేల రూపాయలు పరిహారం చెల్లించనున్న ఫేస్‌బుక్, ఎందుకు ? ఎవరికి ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe


 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.