కేంద్ర ఎన్నికల సంఘం అన్యూహ్య నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ కంటే ముందుగానే శాసనసభలు  రద్దయిన రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభాత్వాలు ఈ నిబంధనలను  తప్పినిసరిగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికలసంఘం ముఖ్యకార్యదర్శి నరేంద్ర ఎన్‌.బుటోలియా  గురువారం కేంద్రం ప్రభుత్వంతో పాటు  అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. కాగా తాజా ప్రకటనతో ఇక ప్రభుత్వాలు రాష్ట్రానికి సంబంధించినంత వరకూ ఎలాంటి కొత్త పథకాలూ, ప్రాజెక్టులు ప్రకటించడానికి వీల్లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్
గత నిబంధలను అనుసరించి ఎన్నికల నోటిఫికేషన్ విడదలయ్యే వరకు కొత్త పథకాలు, ప్రాజెక్టులపై ప్రకటన చేసుకోవచ్చు. ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఈ రోజు నుంచి ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది. ఈ  ప్రక్రియ ఎన్నికల పూర్తయ్యేంత వరకు అమల్లో ఉంటుంది. ఈసీ తాజా నిర్ణయంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన రాష్ట్రాలకు ఇది వర్తించదు. తక్షణమే ఎన్నికల కోడ్ ను పాటిల్సి ఉంది.


తెలంగాణలో ఇక కొత్త పథకాల ప్రకటనకు వీల్లేదు
ఈసీ తాజా నిర్ణయంతో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే  ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లయింది.  ఎన్నికలు ప్రకటించకుండానే ఒక రాష్ట్రంలో ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా ఎన్నికలు ముగిసే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్  కేవలం రోజువారీ కార్యకలాపాలకు పరిమితం కావాలి తప్పితే ఓటర్లను ప్రభావితం చెసే పెద్దపెద్ద విధాన నిర్ణయాలు, కొత్త పథకాలు, ప్రాజెక్టులు ప్రకటించడానికి వీల్లేదు. ఈసీ నిర్ణయం ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్న కేసీఆర్ కు ఇబ్బందికరంగా పరిగణించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.