మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఉత్కంఠత వీడింది. మ్యాజిక్ ఫిగర్ కు అతిచేరువలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం చేసుకుంది. మొత్తం 230 స్థానాలులన్నమధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాట్లుకు మేజిక్ ఫిగర్ 116. అయితే కాంగ్రెస్ కూటమికి దక్కింది 115 స్థానాలే అంటే ప్రభఉత్వ ఏర్పాటుకు కనీసం  ఒకరి మద్దతు అవసరం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని చిన్నపార్టీలు కీలకంగా మారాయి. ఈ క్రమంలో ఫలితాలు వెలువడగానే రెండు స్థానాలు గెల్చుకున్న బీఎస్సీ, ఒక స్థానం గెల్చుకున్న ఎస్పీతో సహా ఇతర చిన్నాచితక పార్టీలును సంప్రదించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ కు మద్దతుపై మాయ ప్రకటన


కాంగ్రెస్ సంప్రదింపులపై స్పందించిన బీఎస్పీ చీఫ్ మాయవతి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో హస్తం పార్టీకి మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మతతత్వ పార్టీ బీజేపీకి అధికారంలోకి రానివ్వకుడదనే ఉద్దేశంతో తాము కాంగ్రెస్ మద్దతివ్వాలని నిర్ణయించామని ఆమె ప్రకటించారు.


ఎస్సీ మద్దతు కూడా కాంగ్రెస్ కే


ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఒకే ఒక్క స్థానంలో గెలిచిన ఎస్పీ కూడా కాంగ్రెస్ కు బాసటగా నిలిచింది. తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని ఆ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న మరికొన్ని చిన్న పార్టీలు కూడా కాంగ్రెస్ పంచన చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికీ మధ్యప్రదేశ్ లో పూర్తి స్థాయి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.


ఓటమిని అంగీకరించిన బీజేపీ


ఇదిలా ఉండగా గత మూడు పర్యయాలు అధికారాన్ని అనుభవించిన బీజేపీ 109 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చోనుంది. ఈ మేరకు తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు పర్యయాలు ప్రజలు తనకు అధికారాన్ని ఇచ్చారని అందుకు తన ధన్యవాదాలు తెలిపారు. ఈ సారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలని ప్రజలు నిర్ణయించారని.. ప్రజా తీర్పును శిసరావహించి ప్రతిపక్షంలో ఉంటూ నిర్మాణాత్మమైన పాత్ర పోషిస్తామని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.