EPFO: ఉద్యోగుల భవిష్య నిధి(EPFO) ఖాతాదారులతో కలకల లాడుతోంది. ఒక్క మే నెలలో 16.8 లక్షల మంది కొత్త ఖాతాదారులు చేరారు. గతేడాది ఇదే నెలలో 9.2 లక్షల మంది చందాదారులు ఉన్నారు. ఈఏడాది ఆ సంఖ్య దాదాపు 83 శాతంగా ఉంది. ఈ విషయాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు కంటే నెలలో కొత్త నమోదులు అధికంగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021 మేలో నికర చందాతో పోలిస్తే ఏడాది మేలో 7.6 లక్షల నికర ఖాతాదారులు పెరిగినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. ఈఏడాది మేలో మొత్తం 16.8 లక్షల చందాదారులతో దాదాపు 9.60 లక్షల మంది సభ్యులు 1952 ఈపీఎఫ్‌ అండ్ ఎంపీ చట్టం పరిధిలోకి వచ్చారు. మరోవైపు 7.21 లక్షల ఖాతాదారులు రిటైర్మెంట్ ఫండ్‌ నుంచి వెలదొలిగారు. కొంత మంది ఉద్యోగాలు మారిన ఈపీఎఫ్‌లో కొనసాగుతున్నారు. 


మరికొంత మంది ఖాతాదారులు తమ నిధులను బదిలీ చేసుకున్నట్లు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. 22 నుంచి 25 ఏళ్ల వయస్సు గల వారు మే నెలలో 4.33 లక్షల మంది చేరారు. దీంతో వ్యవస్థీకృత రంగంలోకి తొలిసారి ఉద్యోగులు మారుతున్న విషయాన్ని ఈసంఖ్య చెబుతున్నాయి.


Also read:India vs West Indies: రేపటి నుంచి భారత్, విండీస్ మధ్య వన్డే సిరీస్..టీమిండియా జట్టు ఇదే..!


Also read:Presidential Election Result-LIVE* Updates: కొనసాగుతున్న భారత రాష్ట్రతి ఎన్నికల కౌంటింగ్..విజయం ఎవరిదో..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook