`హజ్`ను రాముడు ఓడించారు: సుశీల్ మోదీ
గుజరాత్ `హజ్` (హజ్- హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మీవానీ) పై రాముడి విజయంగా ప్రధాని నరేంద్ర మోదీని పోల్చారు బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ
బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ సోమవారం భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా, గుజరాత్ 'హజ్' (హజ్- హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మీవానీ) పై రాముడి విజయంగా ప్రధాని నరేంద్ర మోదీని పోల్చారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విక్టరీ సాధించిన సంతోషంలో ఆయన ట్విట్టర్ లో ఈ విధంగా పేర్కొన్నారు.
గుజరాత్ లో 99 సీట్లతో బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ నుంచి కఠినమైన పోటీని ఎదుర్కొంది బీజేపీ. ఈ ఎన్నికల్లో బీజేపీ 1.25 శాతం, కాంగ్రెస్ 2.47 శాతం ఓట్లు పెంచుకున్నారు. డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ- నోట్లరద్దు, జీఎస్టీలపై గబ్బర్ సింగ్ టాక్స్ అని విమర్శలు చేసిన వారు (రాహుల్ గాంధీని సూచిస్తూ..) బీజేపీ విజయాన్ని చూసైనా గుణపాఠం నేర్చుకోవాలి" అన్నారు.
గుజరాత్ లో వరుసగా ఆరవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ పార్టీ పటీదార్లు, ఓబీసీలు, దళితులు తదితర సామజిక వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. మరోవైపు, 1990 నుండి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధిక సీట్లను గెలుచుకుంటోంది. ఓబీసీ నాయకుడు అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్ టిక్కెట్ పై గెలుపొందారు. అలాగే దళిత నాయకుడైన జిగ్నేష్ మీవానీ కాంగ్రెస్ నుండి పోటీ లేకుండా స్వతంత్రంగా పోటీచేశారు.
బీజేపీ విజయంపై పటీదార్ ఆందోళన్ సమితి నాయకుడు హార్దిక్ పటేల్ పెదవి విరిచారు. "చాణక్యనీతి అంటూ ఏమీ లేదు. డబ్బు, అధికారం, ఈవీఎం రిగ్గింగ్ లు గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గెలుపుకు సహాయపడ్డాయి" అన్నారు.