Income Tax Jobs 2021: భారత ప్రభుత్వానికి చెందిన ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఉత్తర ప్రదేశ్ (ఈస్ట్) డివిజన్ స్పోర్ట్స్ కోటాలో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫుల్ టైమ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ లాంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 28 ఖాళీలు ఉన్నాయి. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, కబడ్డీ, హాకీ, కరాటే లాంటి క్రీడల్లో రాణించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అప్లికేషన్స్ రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 30 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు   -    28
ట్యాక్స్ అసిస్టెంట్ -    13
మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 12
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ -3


Also Read: PG Medical New Courses: జాతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు, కొత్త పీజీ కోర్సులు


ముఖ్యమైన అంశాలు:
దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 30
విద్యార్హతలు- ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. గంటకు 8,000 పదాలు డేటా ఎంట్రీ చేయాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి.
వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు జనరల్, ఓబీసీ కేటగిరీలో 5 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీలో 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- దరఖాస్తుల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత తదుపరి ప్రక్రియ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
వేతనం- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు రూ.56,900, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు రూ.81,100, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టుకు రూ.1,42,400 వరకు వేతనం లభిస్తుంది.


దరఖాస్తు విధానం
Step 1- అభ్యర్థులు https://www.incometaxindia.gov.in/ వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో జాబ్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.
Step 2- జాబ్ నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.
Step 3- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
Step 4- పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్‌ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.
Step 5- దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Income Tax Officer (Hq)(Admn),
O/o Principal Chief Commissioner of Income Tax,
UP (East), Aayakar Bhawan,
5-Ashok Marg,
Lucknow-226001.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook