Income tax return: 2021-22 సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిట‌ర్న్స్ దాఖ‌లుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఆదివారంతో  ఐటీ రిటర్న్స్  దాఖలు ముగియనుంది. దీంతో మరోసారి ఐటీ శాఖ జనాలను అప్రమత్తం చేసింది. గడువులోగా ఇన్కం ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలని సూచించింది. శనివారం రాత్రి వరకు దాదాపు ఐదు కోట్ల ఐటీఆర్‌లు దాఖ‌లు చేశార‌ని ఆదాయప పన్ను విభాగం అధికారులు చెబుతున్నారు. శుక్ర‌వారం వ‌ర‌కు 4.52 కోట్ల మందికి పైగా ఐటీఆర్‌లు దాఖ‌లు చేశార‌ు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐటీ శాఖ అంచనాలో ఇది కేవలం 40 శాతం మాత్రమే. శనివారం మరో 50 లక్షలకు పైగా  ఐటీఆర్‌లు దాఖ‌ల‌య్యాయ‌ని తెలుస్తోంది. ఇంకా సగం మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఐటీఆర్‌లు దాఖ‌లు చేయ‌డానికి గ‌డువు పొడిగించే యోచ‌నేమీ లేద‌ని స్పష్టం చేస్తున్నారు. ఆదివారంతో గడువు ముగుస్తున్నందున ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలని ప‌న్ను చెల్లింపుదారుల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా సూచించింది ఆదాయం ప‌న్ను విభాగం. 



ఐటీఆర్‌ల దాఖ‌లు ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు (సీబీడీటీ), కేంద్ర ఆర్థిక‌శాఖ ప‌ర్య‌వేక్షిస్తున్నాయి. ఐటీఆర్‌ల దాఖ‌లు ప్ర‌క్రియ‌లో సాంకేతిక లోపాల‌ను ప‌రిష్క‌రించ‌డానికి సాంకేతిక నిపుణుల‌తో  వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇది నిరంతరం కస్టమర్ల కోసం పని చేస్తోంది.  వార్ రూమ్‌తోపాటు సీబీడీటీ సోష‌ల్ మీడియా టీం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌న్ను చెల్లింపుదారుల‌ నుంచి  వ‌చ్చే స‌మాచారాన్నిసేక‌రిస్తోంది. వాళ్లకు ఏమైనా సమస్యలుంటే పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డానికి గ‌డువు పొడిగించాల‌నే డిమాండ్లు వస్తున్నాయి. అందుకు సంబంధించి వివిధ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న అభ్య‌ర్థ‌న‌ల‌ను సీబీడీటీకి పంపుతున్న‌ట్లు ఐటీ విభాగం అధికారులు చెబుతున్నారు. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి సుమారు 5.89 కోట్ల ఐటీఆర్‌లు ధాఖలయ్యాయి. 


Read also: Komatireddy:మునుగోడులో కోమటిరెడ్డి ఒంటరయ్యారా? అందుకే రాజీనామాకు భయపడుతున్నారా? 


Read also:Cash In MLA Car:కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కారులో భారీగా కరెన్సీ కట్టలు! ప్రభుత్వాన్ని పడగొట్టడానికేనా?    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook