Party Donations: రాజకీయ వ్యవస్థ ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో భిన్నంగా ఉంటుంది. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో రెండు పార్టీలో ఉండగా.. ఇండియాలో మాత్రం పార్టీల సంఖ్య వేలల్లో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉన్న వివరాల ప్రకారం దేశంలో 2099 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే అందులో ఎన్నికల కమిషన్ గుర్తింపు ఉన్నది కేవలం 55 రాజకీయ పార్టీలకే. పార్టీ రిజిస్టర్ ప్రక్రియ సులభంగా ఉండటంతో ఎవరికి వారు పార్టీలు పెడుతున్నారు. ఇక్కడో మరో ట్విస్ట్ ఉంది. మన దేశంలో రాజకీయ పార్టీలు విరాళాలు సేకరిస్తుంటాయి. ప్రతి ఏటా కొందరు బడబాడాలు, సంస్థలు వివిధ పార్టీలకు విరాళాలు ఇస్తుంటాయి. దేశంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వారికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. ఇదే ఇప్పుడు అక్రమార్కులకు అస్త్రంగా మారుతోంది. కొందరు బడాబాబులు పార్టీల విరాళాల పేరుతో మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నారు. ఊరు పేరు లేని పార్టీలకు కోట్ల రూపాయలు ఇస్తూ... పన్ను మినహాయింపు పొంది... తిరిగి వాటిని అక్రమ మార్గంతో సొంతం చేసుకుంటున్నారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్ బుధవారం ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయి గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్,  యూపీ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోని 20  రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యాలయాలపై ఐటీ సోదాలు జరిగాయి. ఏకకాలంలో నిర్వహించిన ఐటీ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.  పలు రాజకీయ పార్టీల విరాళాల అక్రమాలు రట్టయ్యాయి. రాజకీయ పార్టీలకు విరాళాల పేరిట కొందరు బడాబాబులు కోట్లాది రూపాయలను తరలించారని తేలింది. రాజకీయ పార్టీలకు మురికివాడలు చిన్న దుకాణాలు ఫ్లాట్ల నుంచి కూడా విరాళాలు వచ్చినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. 


యూపీ సుల్తాన్ పూర్ లో వాచ్ రిపేర్ షాపు కేంద్రంగా నడుస్తున్న ఓ గుర్తింపు లేని రాజకీయ పార్టీకి గత మూడేళ్లుగా ఏకంగా 370 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయని ఐటీ అధికారులు గుర్తించారు. ఆ గుర్తింపులేని రాజకీయ పార్టీ అధ్యక్షుడి కోసం ఆరా తీయగా.. వాచ్ రిపేర్ షాపు యజమానికి  రాజకీయ పార్టీ విరాళం గురించి తెలియదని తెలిసింది. ఆ పార్టీ అధ్యక్షుడు అహ్మదాబాద్ లో ఉంటారని తెలియడంతో అతన్ని పట్టుకుని ఐటీ అధికారులు విచారించారు. అయితే తాను  3 శాతం కమీషన్ మాత్రమే తీసుకొని పార్టీ విరాళానికి డొనేషన్ సర్టిఫికెట్ జారీ చేశానని చెప్పడంతో ఐటీ అధికారులు విస్తుపోయారు. ముంబైలోని సియాన్ మురికివాడలో వంద గజాల చిన్న గుడిసె చిరునామాతో నమోదైన  రాజకీయ పార్టీకి గత రెండేళ్లలో వంద కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయి. ఈ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు లేదు. పార్టీ అధ్యక్షుడిని విచారించగా.. తనకు ఏమి తెలియదని.  విరాళాల సంగతి అహ్మదాబాద్ లో ఉండే ఆడిటర్ చూసుకుంటారని చెప్పాడు. 


ముంబై  బోరివలిలోని రేకుల షెడ్డులో నడుస్తున్న ఓ రాజకీయ పార్టీ  50 కోట్ల విరాళాలు వచ్చాయని ఐటీ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన  విరాళాలు పలువురి చేతులు మారినట్లు గుర్తించారు.  మహారాష్ట్ర,  గుజరాత్ లోని గుర్తింపు లేని పలు రాజకీయ పార్టీలు ఏకంగా 2 వేల కోట్ల రూపాయల విరాళాలు సేకరించాయని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు. వాటి అక్రమ బాగోతం మొత్తం బయిటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవారికి ఆదాయపన్ను మినహాయింపు ఉండటంతో.. పన్నును తప్పించుకోవడానికి ఇలా ఫేక్ పార్టీలను  ఏర్పాటు చేసి విరాళాలు ఇస్తున్నారని చెబుతున్నారు. ఇలా రాజకీయ పార్టీల విరాళాల పేరిట పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని, మనీ లాండరింగ్ జరుగుతుందని ఐటీ అధికారుల విచారణలో తేలింది. 21 రాజకీయ పార్టీల విరాళాలను పరిశీలిస్తేనే వేల కోట్ల విరాళాలు సేకరిస్తే... దేశంలోని మొత్తం 5 వేల పార్టీలు వివరాల చూస్తే ఇంకా ఎలాంటి అక్రమాలు బయటికి వస్తాయో మరీ.. 


Also Read: MLC KAVITHA:ఈసారి కవిత బతుకమ్మ ఎక్కడ.. ఈడీ ఆఫీసా, సిబిఐ ఆఫీసా? కోమటిరెడ్డి ట్వీట్ తో రాజకీయ రచ్చ... 


Also Read: Divya Vani to Join BJP: బీజేపీలోకి దివ్యవాణి.. అంతా సిద్ధమే కానీ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి