Independence Day 2023 Guests: న్యూఢిల్లీ: మన దేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగి రోజు ఏదైనా ఉందా అంటే అది మనకు స్వాతంత్య్రం లభించిన స్వాతంత్య్ర దినోత్సవం రోజే అని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. 200 ఏళ్ల పాటు బ్రిటిషర్ల అరాచకపు పాలన నుండి మన దేశానికి విముక్తిని ప్రసాదించిన రోజు అది. అందుకే ఆగస్టు 15 అంటే మన భారతీయులు అందరికీ అత్యంత ఇష్టమైన రోజు.. మనందరం సగర్వంగా తలెత్తుకుని బతికేందుకు అవకాశం ఇచ్చిన రోజు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు 15 నాడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జండా ఎగరవేసి జాతిని ఉద్దేశించి కీలకమైన ఉపన్యాసం చేస్తారు. మనకు స్వేచ్ఛను ప్రసాదించిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులను, మహనీయులను స్మరించుకుంటూ సాగే ఆ ప్రసంగంలో స్వాతంత్య్రం అనంతరం మన దేశం సాధించిన ప్రగతిని కూడా వివరిస్తారు. అంతటి కీలకమైన మన పంద్రాగస్టు పండగని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రత్యేక అతిథులు
ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశం నలుమూలల నుండి నర్సులు, రైతులు, పిఎం - కిసాన్ పథకం లబ్ధిదారులకు ప్రత్యేక అతిథులుగా హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందింది. ప్రతీసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించాలనే లక్ష్యంలో భాగంగానే వివిధ వర్గాల నుండి 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తున్నట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.


మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ పంద్రాగస్టు వేడుకలకు సర్పంచ్‌లు, రైతులు, మత్స్యకారులు, ఉపాధ్యాయులు, నర్సులు, నేత కార్మికులు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న కార్మికులకు కేంద్రం ఆహ్వనం పంపించింది. అందులో భాగంగానే దేశం నలుమూలల నుంచి దాదాపు 1,800 మంది ప్రత్యేక ఆహ్వానితులు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


ఆ కార్మికులు, వారి జీవిత భాగస్వాములకు ఆహ్వానం
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, అమృత్ సరోవర్ ప్రాజెక్ట్‌లు, హర్ ఘర్ జల్ యోజన ప్రాజెక్ట్‌లకు సహకరించిన కార్మికులతో పాటు వారి జీవిత భాగస్వాములకు కూడా ఆహ్వానాలు అందించినట్టు కేంద్రం పేర్కొంది.


PM-కిసాన్ లబ్ధిదారులు
ప్రత్యేక అతిథులుగా, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM-KISAN) గ్రహీతలు ఆగస్టు 15, 2023న ఐకానిక్ ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపు 1,800 మంది ఈ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానాలు అందుకున్నారు. ఎర్రకోట నుండి ప్రధానమంత్రి జాతీయ ప్రసంగం, పథకం యొక్క యాభై మంది లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ఇతర ఆహ్వానితులలో ఉపాధ్యాయులు, రైతులు, నర్సులు, మత్స్యకారులు, కార్మికులు వంటి సామాన్యులు ఉండటం విశేషం.