Interesting Facts of Independence: 1947 ఆగస్టు 15 నుంచి దేశం బ్రిటీషు చెర నుంచి స్వేఛ్చా వాయువులు పీల్చుకుంది. అందుకే ఆ రోజు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటుంది. స్వాతంత్య్ర వేడుకలంటే అందరికీ ఇష్టమే. కానీ అదే స్వాతంత్య్రం గురించి కొన్ని నిజాలు మాత్రం ఎవ్వరికీ తెలియవు. అందరికీ ఆశ్చర్యం కల్గించే ఆ నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం లభించినా రెండు పట్టణాలకు మాత్రం ఆ స్వేచ్ఛ దక్కలేదు. విభజన సమయంలో రెండు కీలకమైన పట్టణాలు పఠాన్ కోట్, గురుదాస్ పూర్ పాకిస్తాన్‌లో ఉండిపోయాయి. ఇండియా పాకిస్తాన్ రెండుగా చీలిన తరువాత లక్షలాది మంది ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ రెండు పట్టణాలు మాత్రం పాకిస్తాన్ భాగంలో వెళ్లిపోయాయి. కానీ రెండు రోజుల్లో ఓ వ్యక్తి చేసిన ప్రయత్నాల వల్ల ఆగస్టు 17న తిరిగి భారత భూభాగంలో వచ్చేశాయి. లేకపోతే గురుదాస్ పూర్, పఠాన్ కోట్ పట్టణాలు పాకిస్తాన్‌లో భాగంగా ఉండి ఉండేవి.


గురుదాస్ పూర్, పఠాన్ కోట్ రెండు జిల్లాలు విభజన సమయంలో పాకిస్తాన్ వాటాలో వెళ్లిపోయాయి. కానీ తరువాత జస్టిస్ మెహర్ చంద్ చేసిన ప్రయత్నాలతో రెండు జిల్లాలు తిరిగి ఇండియాలో భాగమయ్యాయి. నాటి ఘటనను జస్టిస్ మెహర్ చంద్ మనవడు రాజీవ్ కిషన్ మహజన్ గుర్తు చేసుకున్నారు. నాడు ఏం జరిగిందో వివరించారు.


భారత భూభాగాన్ని పాకిస్తాన్ నుంచి తిరిగి రప్పించిన కుటుంబ వ్యక్తి అయినందుకు గర్వంగా ఉందంటున్నాడు రాజీవ్ కిషన్. విభజన సమయంలో గురుదాస్ పూర్, పఠాన్ కోట్ ప్రాంతాలు పాకిస్తాన్ వాటా కింద వెళ్లిపోయినా తన తాతయ్య జస్టిస్ మెహర్ చంద్ ప్రయత్నాలతో రెండు రోజుల్లోనే ఇండియాకు వచ్చేశాయని చెప్పారు. నాడు ఈ ప్రకటనను అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రేడియో ద్వారా తెలిపారు.


దేశం స్వాతంత్య్రం పొంది 78 ఏళ్లవుతున్నా ఇంకా నాటి విభజన గాయాలు మస్తిష్కం నుంచి చెరగలేదు. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్‌లో పాకిస్తాన్ సరిహద్దులో ఉండే రతన్ చంద్ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. విభజన తరువాత పఠాన్ కోట్, గురుదాస్ పూర్ జిల్లాలు పాక్ భాగంలో ఉండిపోయాయి. దాదాపు రెండున్నర రోజుల తరువాత అంటే ఆగస్టు 17 న తరిగి ఇండియాలో విలీనమైపోయాయి.


విభజన సమయంలో చిన్న పిల్లలుగా ఉన్నా ఇప్పటికీ నాటి విషాదం గుర్తొస్తోందని చెప్పుకొచ్చారు. విభజన సమయంలో ఒకరికొకరు శత్రువులుగా మారిపోయారని గుర్తు చేసుకున్నారు. ఆనాడు పాకిస్తాన్ భాగంలోకి పఠాన్ కోట్, గురుదాస్ పూర్ వెళ్లిపోయాయి. దాంతో పఠాన్ కోట్‌కు చెందిన జస్టిస్ మెహర్ చంద్ తీవ్రంగా ప్రయత్నించి ఆ రెండు పట్టణాలను ఇండియాలో విలీనమయ్యేలా చేశారు. జస్టిస్ట్ మెహర్ చంద్ మూడవ ప్రధాన న్యాయమూర్తి. అంతకుముందు ఆయన మహారాజా హరిసింహ్ కాలంలో జమ్ము కాశ్మీర్ రాష్ట్రపు ప్రధానమంత్రిగా పనిచేశారు. 


Also read: Aadhaar Card Photo Update: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా, ఇలా సులభంగా మార్చుకోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook