Flags On vehicles: వాహానాలపై జాతీయ జెండాలు పెట్టుకుని తిరుగుతున్నారా ?... ఈ చిక్కుల్లో పడ్డట్లే..
Independence day 2024: ఇండిపెండెన్స్ డే రోజు లేదా గణతంత్ర దినోత్సవం రోజున చాలా మంది తమ కార్లు, టూవీలర్ ల మీద జాతీయ జెండాలను కట్టుకుని ర్యాలీలు తీస్తుంటారు. తమ దైన శైలీలో దేశభక్తిని చాటుకుంటుంటారు. కానీ ఇండియన్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం కొన్ని నియమాలను అందరు తప్పనిసరిగా పాటించాలి.
Independence day 2024 flag rules: మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకోని రావడం కోసం ఎందరో మహానుభావులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. 200 ఏళ్ల పాటు బ్రిటీష్ వారు మనదేశాన్ని పాలించి అన్నిరకాలుగా మనదేశ పౌరులను చిత్రహింసలకు గురిచేశారు. మహిళల ప్రాణ,మానాలను దోచుకున్నారు. కానీ ఎన్నో ఉద్యమాలు, మరేన్నో బలిదాల తర్వాత బ్రిటిష్ వారి చెర నుంచి భారతదేశం విముక్తిని పొందింది. అందుకు మన దేశంలో ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26 న రాజ్యంగం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జాతీయ జెండాలను ఎగుర వేస్తుంటాం.
ఈరోజుల్లో దేశంలోని ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కార్యాలయాలు.. ప్రతిచోట మువ్వన్నెల జెండాను ఎగురవేస్తుంటారు. ముఖ్యంగా యువత మన దేశం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారిని స్మరించుకుంటూ, రాబోయే తరాలకు వారి త్యాగాలు చెప్పుకుంటూ ఇండిపెండెన్స్ డే వేడుకలను జరుపుకుంటుంటారు. ఈరోజున ముఖ్యంగా ఊరువాడ, పల్లె పట్నం అంత పండగలా ఉంటుంది.
ఆఫీసులు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల అధికారిక భవనాల్లో కూడా జాతీయ జెండాలతో చక్కగా అలంకరిస్తారు. ఆయా ప్రదేశాల్లో అధికారులు.. జాతీయ జెండాలను ఎగురవేస్తుంటారు.ఇదిలా ఉండగా.. ఆగస్టు 15 లేదా జనవరి 26 తేదీల్లో జెండా పండుగ జరుపునేప్పుడు యువత ఎక్కువగా కార్లు, బైక్ ల మీద ర్యాలీలుగా వెళ్తుంటారు. తమ వాహానాలకు జాతీయజెండాలను పెట్టుకుంటారు. కానీ ఇండియన్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం.. కొన్ని నియమాలు ఉన్నాయి. ఇవి ఉల్లంఘిస్తే మాత్రం జరిమానతో పాటు, కొన్నిసార్లుజైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.
దేశ పౌరులకు ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే హక్కు, తమ చేతుల్లో జెండాను పట్టుకొని తిరిగే హక్కు స్వేచ్చగా ఉంటుంది. కానీ ప్రైవేట్ వాహనాలపై జెండాలు పెట్టి తిరగడం మాత్రం చట్టరిత్యా నేరం. కొంతమంది తమ బైకులు, కార్లపై జెండాలను పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరూ జెండాను తమ వాహానానికి పెట్టుకోవద్దని ఒకరూల్ ఉంది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం వాహనాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడం నిర్ధిష్ట వ్యక్తులు చట్టప్రకారం తప్పచేసిన వారవుతారు. వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపే ఛాన్స్ కూడా ఉంది.
Read more: Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..
ఎవరైనా ఈ నేరాలకు పాల్పపడితే జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971 ప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటారు. దీని ప్రకారం జాతీయ జెండా, రాజ్యంగం, జాతీయ గీతం వంటి భారతీయ జాతీయ చిహ్నాలను అవమానిస్తే.. సదరు వ్యక్తికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా రెండూ విధించే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏ రోజు, ఏ సందర్బంలోనైనా జాతీయ జెండా ఎగురవేయవొచ్చు. జాతీయ జెండా ఎప్పుడు ఎగురవేసినా దానికి గౌరవం ఇవ్వాలి. సరైన స్థలంలో ఉంచాలి. నేలపై, మురికి ప్రదేశంలో ఉంచకూడదు.చిరిగిన జెండా ఎగురవేయకూడదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter