Independence day 2024 Upasana konidela tweet on Kolkata doctor rape and murder case: ఇండిపెండెన్స్ డే వేళ మెగా కోడలు ఉపాసన కొణిదేల చేసిన ట్విట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.  కోల్ కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై రామ్ చరణ్ సతీమణి  తీవ్రంగా స్పందించారు. దేశంలో మానవత్వాన్ని పూర్తిగా అపహస్యం చేసే సంఘటన ఇదని అన్నారు. సమాజంలో అనాగరికతకు అద్దం పట్టేలా సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి  పరిస్థితులు కొనసాగుతుంటే.. మనం ఎలాంటి ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నామని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మనదేశానికి మహిళలు వెన్నుముక లాంటి వారని అన్నారు.ముఖ్యంగా హెల్త్ కేర్ రంగంలో మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రాణిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ మహిళ డాక్టర్ పై అఘాయిత్యం దారుణమన్నారు. ఈ సంఘటనలు చూస్తే మానత్వం ఎటుపోతుందో...అని ఆందోళనకల్గుతుందని ఉపాసన  కొణిదెల ఎమోషనల్ అయ్యారు. 


ఇదిలా ఉండగా.. కోల్ కతా ట్రైయినీ డాక్టర్ పై అత్మాచారం, హత్య ఘటన దేశంలో తీవ్రదుమారంగా మారింది. ఈఘటనలో ఇప్పటికే హైకోర్టు  సీబీఐకి అప్పగించింది. బీహార్ కు చెందిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి పోస్టుమార్టం రిపోర్టులో.. సాముహిక అత్యాచారం జరిగినట్లు బైటపడింది. అదే విధంగా ఆమె శరీరంలో 150 ఎంఎల్ ల వీర్యం ఉన్నట్లు కూడా వైద్యులు చెప్పారు.


ఆమె నోటిలో నుంచి , కళ్ల రక్తం వచ్చాయని వైద్యులు పేర్కొన్నారు. శరీరంలోని అంతర్గత అవయవాలు కూడా పూర్తిగా డ్యామెజ్ అయినట్లు కూడావైద్యులు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం దేశంలో ఈ ఘటనపై నిరసలు మిన్నంటాయి.


Read more: Independence Day 2024: జాతీయ జెండాలను తమ వాహానాలపై ఎవరు పెట్టుకోవచ్చు... ఫ్లాగ్ కోడ్ ఏంచెప్తుందో తెలుసా..?


దేశ వ్యాప్తంవగా  మెడికోలు.. అందరు బైటకు వచ్చి, నిందితులను సరైన విధంగా పనిష్మెంట్ చేయాలని కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. మెడికోలకు,జూనియర్ డాక్టర్లకు సెఫ్టీ కరువైందని కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. మమతా సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter