Chinese Apps Ban: చైనాకు భారత్ షాక్... మరో 54 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం..!
Chinese Apps: దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన మరో 54 యాప్‌లపై నిషేధం విధించడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది.
Ban on Chinese apps: దేశ భద్రత, గోప్యత దృష్ట్యా మరోసారి చైనా యాప్‌లపై (Chinese Apps) కొరడా ఝలిపించేందుకు భారత్ సిద్ధమైంది. మరో 54 చైనీస్ యాప్‌లపై నిషేధం విధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం (Central Govt) తాజాగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు సోమవారం వెల్లడించాయి. నిషేధించబడే యాప్‌లలో.. స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, బ్యూటీ కెమెరా - సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ రివర్, డ్యూయల్ స్పేస్ లైట్, యాప్ లాక్ వంటి యాప్‌లు ఉన్నాయి.
మే 2020లో చైనాతో (China) సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో దాదాపు 300 యాప్‌లు బ్లాక్ చేయబడ్డాయి. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. జూన్ 2020లో చైనా యాప్ లపై మొదటి రౌండ్ నిషేధాన్ని ప్రకటించింది. దేశ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ టిక్‌టాక్, వీచాట్ షేర్‌ఇట్, హలో, లైకీ, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది.
2020 సెప్టెంబరులో 118 యాప్‌లు, నవంబరులో 43 చైనా యాప్‌లను మరోసారి నిషేధించింది భారత ప్రభుత్వం. మెుత్తంగా దాదాపు 224 చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం యాప్‌లను నిషేధించినట్లు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MEITY) తెలిపింది.
Also Read: ఉక్రెయిన్‌పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. పుతిన్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook