Terrorist at Border: దేశానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందా..?  భారత్‌లోకి చొరబడేందుకు జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు కాచుకుని ఉన్నారా..? అవుననే అంటున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. నిఘా వర్గాల హెచ్చరికలతో  సరిహద్దు భద్రతా దళం అప్రమత్తమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతోంది. ఆర్మీ చీఫ్‌కు ప్రభుత్వానికి మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. దాంతో సైన్యంపై ప్రభుత్వ నియంత్రణ కొరవడింది. వీటన్నింటినీ ఆసరా చేసుకుని ఉగ్రవాదులు మన దేశ సరిహద్దుల్లో కార్యకలాపాలు ముమ్మరం చేసినట్లు నిఘావర్గాలు గుర్తించాయి.


జమ్మూకశ్మీర్‌ బందిపొరా జిల్లాలోని గురేజ్ సెక్టారు, కుప్వారా జిల్లాలోని కేరన్, మచిల్ సెక్టార్ల వద్ద చొరబడేందుకు వారంల్లో 117 మంది ఉగ్రవాదులు చేరుకున్నట్లు సమాచారం. దీంతో సరిహద్దుల్లోని ఎల్‌ఓసీ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. 24 పోస్టుల వద్ద బీఎస్ఎఫ్ సిబ్బంది గస్తీ ముమ్మరం చేశారు.


రింగ్ పెన్, కుమ్కారి గాలి ద్వారా టెర్రరిస్టులు కుప్వారాలోకి ప్రవేశించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదుల సంఖ్య గణనీయంగా తగ్గినా.. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఆ రాష్ట్రంలో విదేశీ ఉగ్రవాదుల ఉనికి పెరిగినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 172 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం చురుకుగా ఉన్నారు. వీరిలో 79 వంది పాక్ ఉగ్రవాదులు కాగా 93 మంది స్థానిక టెర్రరిస్టులు.


Also Read: Alia Ranbir Marriage: పెళ్లికి సిద్ధమైన ఆలియా, రణ్ బీర్ కపూర్.. వేడుక జరిగేది అక్కడే!


Also Read: IPL 2022 Points Table: ఐదో స్థానంలో లక్నో.. అట్టడుగు స్థానంలో హైదరాబాద్! ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook