India corona Update: దేశంలో కొవిడ్ కేసులు ఇటీవల భారీగా తగ్గుతూ రాగా.. తాజాగా మళ్లీ వృద్ధి కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,528 కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం ప్రకటించింది. 6,33,867 టెస్టులకు గానూ ఈ కేసులు నమోదైనట్లు వివరించింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.40 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ కారణంగా 149 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది ఆరోగ్య శాఖ. దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,16,281 మంది కొవిడ్​కు బలయ్యారు. దీనితో మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.


యాక్టివ్​  కేసులు ఇలా..


దేశవ్యాప్తంగా ఇంకా 29,181 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్​ కేసుల రేటు 0.07 శాతంగా ఉంది.


అయితే దేశవ్యాప్తంగా రికవరీలు కూడా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 3,997 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 42,458,543 మంది కొవిడ్​ను జయించారు. దేశంలో రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది.


వ్యాక్సినేషన్ ఇలా..


తాజాగా దేశవ్యాప్తంగా 15,77,783 డోసుల కరోనా టీకాలు పంపిణీ చేశారు వైద్య సిబ్బంది. వీటితో కలిపి ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,80,97,94,588 వద్దకు చేరింది.


Also read: Cyclone Asani: దూసుకొస్తున్న 'అసని' తుఫాన్... ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు..


Also read: DRDO New Building: కేవలం 45 రోజుల్లో..బెంగళూరులో 7 అంతస్థుల భవనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook