Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా
కోవిడ్-19 (Coronavirus) 19) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (AstraZeneca) తో కలిసి భారత ఫార్మ దిగజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తుందన్న విషయంపై సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా (Adar Poonawalla) గురువారం కీలక ప్రకటన చేశారు.
Serum CEO Adar Poonawalla on Covid-19 Vaccine: న్యూఢిల్లీ: కోవిడ్-19 (Coronavirus) 19) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (AstraZeneca) తో కలిసి భారత ఫార్మ దిగజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా జతకట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ తుది దశలో ఉన్నాయి. అయితే.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ (AstraZeneca vaccine ) ఉత్పత్తితోపాటు భారత్‌లో మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తోంది సీరం సంస్థ (SII). ఈ క్రమంలో వ్యాక్సిన్ ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తుందన్న విషయంపై ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా (Adar Poonawalla) గురువారం కీలక ప్రకటన చేశారు.
2021 ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అదర్ పునావాలా పేర్కొన్నారు. ముందుగా ఆక్స్‌ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఆరోగ్య సిబ్బందికి, వయసు పైబడిన వారికి అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే సామాన్య ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ ఏప్రిల్‌లో అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ధర రెండు డోసులకుగానూ దాదాపుగా రూ.1000 వరకూ ఉండవచ్చని పూనావాలా పేర్కొన్నారు. అయితే దేశంలోని అందరికీ 2024 నాటికి వ్యాక్సిన్ లభిస్తుందని పూనావాలా తెలిపారు. Also read: Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
అయితే ఇప్పటికే నాలుగు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేశామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. అయితే ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి సరైన సమయంలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు ఆమోదం లభిస్తే 2021 జనవరి లోపు ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను సీఐఐ, ఐసీఎంఆర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. Also read: Sasikala: త్వరలోనే చిన్నమ్మ విడుదల.. రూ.10 కోట్ల జరిమానా చెల్లింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి