Covid 19 Cases Updates: దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసుల సంఖ్య.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే...
తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళలో 1465 కేసులు, మహారాష్ట్రలో 1357 కేసులు, ఢిల్లీలో 405 కేసులు, కర్ణాటకలో 222 కేసులు, హర్యానాలో 144 కేసులు నమోదయ్యాయి.
Covid 19 Cases Updates: దేశంలో కరోనా కేసులు మళ్లీ 4 వేల మార్క్‌ను దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4270 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,76,817కి చేరింది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,24,692కి చేరింది.
గడిచిన 24 గంటల్లో మరో 2619 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు.దీంతో దేశంలో కోవిడ్ రికవరీల సంఖ్య 4,26,28,073కి చేరింది. కోవిడ్ రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 24,052 కోవిడ్ యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.03 శాతం, వీక్లీ పాజిటివ్ రేటు 0.84 శాతంగా ఉంది.
గడిచిన 24 గంటల్లో మరో 4,13,699 కరోనా టెస్టులు నిర్వహించగా.. ఇప్పటివరకూ 85.26 కోట్ల టెస్టులు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,92,427 వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో ఇప్పటివరకూ వేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,09,46,157కి చేరింది.
తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళలో 1465 కేసులు, మహారాష్ట్రలో 1357 కేసులు, ఢిల్లీలో 405 కేసులు, కర్ణాటకలో 222 కేసులు, హర్యానాలో 144 కేసులు నమోదయ్యాయి.ఒక్క కేరళలోనే 34.31 శాతం కరోనా కేసులు నమోదవడం గమనార్హం.
Also Read: Bangladesh Fire: కంటైనర్ డిపోలో మంటలు.. 16 మంది సజీవ దహనం.. 150 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook