India Covid Cases: మరోసారి పెరిగిన కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్ కు సంకేతమా?
India Covid Cases: దేశంలో మరోసారి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా కొవిడ్ కేసుల్లో వృద్ధి కనిపిస్తుంది. కొత్తగా దేశవ్యాప్తంగా 2,380 కరోనా కేసులు నమోదయ్యాయి.
India Covid Cases: భారతదేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా ఫోర్త్ వేవ్ తప్పదనే భయాందోళనలు ప్రతి ఒక్కరిలోనూ మొదలయ్యాయి. అయితే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,380 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,30,49,974 కు చేరుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో 13,433 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొవిడ్ మహమ్మారి బారిన పడి కొత్తగా 56 మరణాలు నమోదయ్యాయి. వీటితో దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,22,062కు చేరుకుంది. ఈ క్రమంలో దేశంలో కరోనా రికవరీ రేట్ 98.76 గా ఉంది.
వరల్డ్ వైడ్ కొవిడ్ వ్యాప్తి..
ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 9,04,073 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కొవిడ్ ధాటికి 3,222 మంది మరణించారు.
ALso Read: Covid Cases In India: దేశంలో కొవిడ్ డేంజర్ బెల్స్.. ఢిల్లీలో భయపెడుతున్న పాజిటివిటీ రేటు..!!
Also Read: Akshay Kumar Apology: పొగాకు కంపెనీతో కాంట్రాక్టు రద్దు చేసుకున్న అక్షయ్ కుమార్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.