India Covid Cases Today: భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా లక్షకు దిగువగా నమోదవుతున్న కరోనా కేసులు.. ఇప్పుడు మరోసారి తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 67,084 మందికి కరోనా సోకినట్లు తేలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 4.4 శాతానికి చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నా.. మరణాలు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. కొవిడ్ మహమ్మారి ధాటికి మరో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు. 


కేరళలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 854 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా ధాటికి దేశ వ్యాప్తంగా 5.06 లక్షల మంది మృతి చెందారు. కరోనా మరణాల్లో మహారాష్ట్ర (1.43 లక్షలు), కేరళ (60,793) ముందున్నాయి. 



కరోనా యాక్టివ్ కేసులు


దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7.9 లక్షలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనా మహమ్మారి నుంచి 1,67,882 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 4.24 కోట్ల మందికి పైగా కరోనా వైరస్ సోకగా.. 4.11 కోట్ల మంది ఆ వైరస్ నుంచి కోలుకున్నారని తెలుస్తోంది.  


Also Read: India corona Update: భారీగా తగ్గిన కరోనా కేసులు- 10 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు!


Also Read: Tribute To Lata Mangeshkar: దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌కు రాజ్యసభ నివాళి.. గంట పాటు వాయిదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook