CCI Fines On Google: గూగుల్‌ వైఖరిపై సీసీఐ మరోసారి సీరియస్ అయింది. ఐదు రోజుల్లోనే రెండోసారి భారీగా జరిమానా విధించింది. ఇటీవల భారత్‌లో ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేసినందుకు రూ.1337.76 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని హెచ్చరించినా గూగుల్ తన ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో రెండోసారి భారీ జరిమానాకు గురైంది.


ఎవరైనా యాప్ డెవలపర్ తన యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో విక్రయించాలనుకున్నా లేదా యాప్/మొబైల్ గేమ్ ద్వారా డబ్బు సంపాదించాలన్నా వారు గూగుల్ ద్వారానే చెల్లింపులు చేశాయి. అయితే భారత్‌లో ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో గూగుల్‌పై సీసీఐ రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. దీనితో పాటు గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్ డెవలపర్‌లకు థర్డ్ పార్టీ పేమెంట్ సిస్టమ్, యూపీఐ కింద డబ్బు సంపాదించడానికి అనుమతించాలని గూగుల్‌ని ఆదేశించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గూగుల్ తన సొంత చెల్లింపు వ్యవస్థను ఉపయోగించమని ఏ యాప్ డెవలపర్‌ను బలవంతం చేయకూడదని స్పష్టం చేసింది. భారత్‌లో జరిమానా విధించడంపై గూగుల్ స్పందించింది. ఇది భారతీయ కస్టమర్లకు పెద్ద ఎదురుదెబ్బ స్పష్టం చేసింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలను తాము సమీక్షిస్తామని చెప్పింది.


ఇటీవల ఎందుకు జరిమానా..?


మనం వాడే స్మార్ట్ ఫోన్స్‌ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ను 2005లో గూగుల్ కొనుగోలు చేయగా.. మొబైల్ కంపెనీలు అన్ని దాదాపు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌నే యూజ్ చేస్తున్నాయి. ఈ ఓఎస్‌తో పాటు గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ సెర్చ్, క్రోమ్, యూట్యూబ్ తదితర యాప్స్‌ను కలిగి ఉంది. వీటి ద్వారా అనైతిక పద్ధతులు అవలంభిస్తోందంటూ రూ.1337.76 కోట్ల జరిమానా విధించింది. తాజాగా గూగుల్ పేమెంట్స్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.936.44 కోట్ల ఫైన్ వేసింది.


Also Read: హేమాహేమీలతో అఖిల్ ఢీ కొట్టడానికి రెడీ అయ్యింది అందుకేనా.. మస్త్ ప్లాన్ ఇది! 


Also Read: Asaduddin Owaisi: ఏదో ఒకరోజు హిజాబ్ అమ్మాయి దేశ ప్రధాని కాగలదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook