Coronavirus update: దేశంలో కరోనా  కేసులు భారీగా తగ్గాయి. ఒక్కసారిగా 14 వేలకు దిగొచ్చిన కేసులు(Covid cases in India).. మార్చి ప్రారంభం నాటి స్థాయికి పడిపోయాయి. గత కొద్దికాలంగా మహమ్మారి వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల, రికవరీ రేట్లు ఊరటనిస్తున్నాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం 11,81,766 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,313 మందికి వైరస్ పాజిటివ్‌(Corona positive cases)గా తేలింది. అంతక్రితం రోజు 18 వేల మందికి వైరస్ సోకగా.. తాజాగా ఆ సంఖ్య 4,000 మేర తగ్గింది. నిన్న ఒక్కరోజే 26,579 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 3.39 కోట్ల మందికి పైగా వైరస్ బారినపడగా.. అందులో 3.33 కోట్ల(98.04 శాతం) మందికి పైగా మహమ్మారిని జయించారు.


Also read: Shah Rukh Khan: షారుక్‌కు బాసటగా నిలిచిన బాలీవుడ్ ప్రముఖులు


మరోపక్క క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 2,14,900(0.63 శాతం)కి తగ్గింది. ఇక మరణాల సంఖ్య కూడా 200 దిగువనే ఉంది. నిన్న 181 మంది ప్రాణాలు(covid deaths) కోల్పోయారు. ఇప్పటివరకు 4,50,963 మంది కరోనా కాటుకు బలయ్యారు. కొద్ది రోజులుగా దేశంలో కరోనా టీకా కార్యక్రమం(Corona vaccination in India) వేగంగా సాగుతోంది. నిన్న 65.86 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 95.8 కోట్లకు చేరింది.


ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 3,15,153 మందికి కరోనా (Corona update) పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి మరో 4,657 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,90,27,175కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,72,739కి పెరిగింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook