India Covid-19: దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు... మెుత్తం కేసులు ఎన్నంటే?
India Covid-19: దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. తాజాగా మరో 4,041 మంది వైరస్ బారినపడ్డారు. వైరస్ తో 10 మంది మృతి చెందారు.
India Covid-19 Update: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 4,041 మందికి వైరస్ పాజిటివ్ (Corona Cases in India) గా నిర్ధారణ అయింది. తాజాగా వైరస్ తో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం వైరస్ నుంచి 2,363 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 21,177 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు నమోదైన మెుత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,31,68,585 కాగా...టోటల్ మరణాల సంఖ్య 5,24,651గా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైదారోగ్యశాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. గురువారం ఒక్కరోజే 1045 మందికి కరోనా వైరస్ సోకింది. ముంబయి, పుణె, ఠాణెల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 12,05,840 మందికి వ్యాక్సినేషన్ అందించారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,93,83,72,365 కు (Covid-19 Vaccination in India) చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 4,25,379 మందికి కరోనా పరీక్షలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 5 లక్షల 44 వేల మందికి వైరస్ సోకింది. వైరస్ తో 1400 మరణించారు. ఉత్తర కొరియాలో మళ్లీ రికార్డు స్థాయిలో లక్ష కేసులు వెలుగుచూశాయి. దీంతో అక్కడ మెుత్తం కేసుల సంఖ్య 40 లక్షలకు చేరింది. నిన్న ఒక్కరోజే యూఎస్ లో 80వేల కేసులు వెలుగుచూశాయి. వైరస్ తో 200 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: LIQUOR DOOR DELIVERY: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఆర్డర్ ఇస్తే 10 నిమిషాల్లో ఇంటికే లిక్కర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook