Bangladesh Violence: రిజర్వేషన్ల వివాదంతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. చిన్నగా మొదలైన ఘర్షణ పెరిగి పెద్దదై సంక్షోభంగా మారింది. అల్లర్లు, దాడులు జరిగాయి. చివరికి ఆ ఆదేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి ఇండియాలో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొరుగుదేశంలో నెలకున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగ్లాదేశ్ సంక్షోభం, జరుగుతున్న పరిణామాలపై ఇవాళ రాజ్యసభలో విదేశాంగ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితిపై ఆందోళనగా ఉందని చెప్పారు. మైనార్టీల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని చాలా ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయన్నారు. కర్ఫ్యూని సైతం లెక్కచేయకుండా ఆందోళనకారులు ఢాకాను చుట్టుముట్టారని చెప్పారు. భద్రతా కారణాలతోనే ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారన్నారు. వెంటనే ఇండియాకు వచ్చేందుకు అనుమతి కోరారని తెలిపారు. నిన్న సాయంత్రం బంగ్లాదేశ్ ప్రధాని షేర్ హసీనా ఢిల్లీకు చేరుకున్నారని వివరించారు. 


బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఇప్పటికీ రగులుకుంటూనే ఉందని, ఆ దేశ ఆర్మీ ఛీప్ మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు గురించి మాట్లాడారాన్నారు. బంగ్లాదేశ్‌లోని భారతీయులతో టచ్‌లో ఉన్నామన్నారు. ఆ దేశంలో దాదాపు 19 వేలమంది భారతీయులు ఉన్నారన్నారు. అందులో 9 వేల మంది విద్యార్ధులే కావడం విశేషం. ఇప్పటికే జూలై నెల వరకూ చాలామంది విద్యార్ధులు స్వదేశానికి చేరారు. బంగ్లాదేశ్ దేశంలోని భారత రాయబార కార్యాలయాలకు ప్రస్తుత ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఆ దేశంలోని మైనారిటీల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. 


ఏదైనా పరిస్థితి చేయి దాటేట్టు ఉంటే అప్రమత్తంగా ఉండాల్సిందిగా బోర్డర్ సెక్యూరిటీ దళాల్ని హెచ్చరించామన్నారు. గత 24 గంటల నుంచి ఢాకాలోని అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. 


Also read: Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం వెనుక కారణమేంటి, రిజర్వేషన్ల వివాదం ఎప్పటిది, నేపధ్యమేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook