Post Office Recruitment 2022: పోస్ట్ ఆఫీసుల్లో 38వేలకుపైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అప్లై చేయండి ఇలా..
Post Office Recruitment 2022: నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్ మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో 38 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Post Office Recruitment 2022: తపాలా శాఖలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ (Post Office Recruitment 2022) విడుదల చేసింది. పోస్టుల శాఖ ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన యువత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ లింక్ indiapostgdsonline.gov.in యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నిన్నటి నుంచే ప్రారంభమైంది.
అర్హతలు: పదో తరగతి పాసై ఉండాలి. పదో తరగతిలో గణితం మరియు ఇంగ్లీషు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉండాలి. స్థానిక భాషపై అవగాహన ఉండాలి. సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు సమర్పించే చివరి తేదీ నాటికి వయస్సు నిర్ణయించబడుతుంది. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: మహిళలు, SC/ST అభ్యర్థులు, వికలాంగులకు ఫీజు లేదు. మిగిలిన వారు రూ.100 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ: పరీక్ష ఉండదు. పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) మరియు డాక్ సేవక్ గా ఎంపిక చేయబడతారు. BPMకి రూ. 12000, ABPM/ డాక్ సేవక్‌కి రూ. 10000 చెల్లించబడుతుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆసక్తి గల అభ్యర్థులు ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ లింక్ indiapostgdsonline.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 2, 2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 5, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook