Covid Updates: దేశంలో మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు... వైరస్ తో ముగ్గురు మృతి..
India Covid Updates: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 841 కేసులు నమోదయ్యాయి. వైరస్ తో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Covid-19 Cases In India : దేశంలో కరోనా విజృంభిస్తోంది. నిన్న స్వల్పంగా తగ్గిన కేసులు.. నేడు మళ్లీ పెరిగాయి. కొత్తగా 841 కరోనా కేసులు వెలుగు చూసినట్లు కేంద్రారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 4,309కు చేరుకున్నట్లు తెలుస్తోంది. గత 227 రోజుల్లో ఇదే అత్యధికం. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కేరళ, కర్ణాటక మరియు బీహర్ లకు చెందినవారు ఉన్నారు.
దేశంలో ఇప్పటిదాకా 4.5 కోట్ల మంది ప్రజలు వైరస్ బారినపడ్డారు. మహమ్మారి బారినపడి 5.3 లక్షల మంది మృత్యువాతపడ్డారు. 4.4 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 220.67 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. దేశంలో కొత్త వేరియంట్ జేఎన్. 1 వ్యాప్తి విస్తరిస్తోంది. చలికాలం కావడంతో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్కులు ధరించడంతోపాటు సమూహాలకు దూరంగా ఉండాలని వారు చెప్పారు. ఒక వేళ వైరస్ బారినపడితే హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.
తెలంగాణలోనూ కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న వరంగల్ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఎంజీఎంలో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసి.. ఆ చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ ఆరుగురు చిన్నారులు వరంగల్ నగరానికి చెందినవారే. రీసెంట్ గా నీలోఫర్ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
Also Read: Maharashtra fire: హ్యాండ్ గ్లవ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు సజీవదహనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook