India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి కట్టడి కావడం లేదు. చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉన్నా సరే కేసుల సంఖ్య మాత్రం భారీగా పెరుగుతోంది. దేశంలో వరుసగా మూడవరోజు కూడా ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా ఉధృతంగా వ్యాపిస్తోంది.సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి జనం వణికిపోతున్నారు. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మూడు రోజుల్నించి పరిస్థితి మరీ ఘోరంగా మారింది. వరుసగా మూడవరోజు కూడా 4 లక్షలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 4 లక్షల 14 వేల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 14 లక్షల 91 వేలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా కారణంగా 3 వేల 915 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా సోకి మరణించినవారి సంఖ్య 2 లక్షల 34 వేలకు చేరుకుంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 853 మంది మరణించారు. దేశంలో రోజుకు సరాసరిన 3 వేల చొప్పున పదిరోజుల్లో 36 వేల 110 మంది మరణించారు. అంటే ప్రతి గంటకు 150 ప్రాణాలు పోతున్నాయి. అమెరికా(America) లో పదిరోజుల్లో 34 వేల 798, బ్రెజిల్‌(Brazil) లో 32 వేల 692మంది మరణించారు. దేశంలో ప్రస్తుతంం 36 లక్షల 45 వేల 164 యాక్టివ్ కేసులున్నాయి.  బెంగళూరు, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో అత్యధిక కేసులున్నాయి


దేశంలో కరోనా రికవరీ రేటు( Corona Recovery Rate) ప్రస్తుతం 81.95 శాతముంది. ఇప్పటివరకూ దేశంలో కరోనా నుంచి 1 కోటి 76 లక్షల 12 వేలమంది కోలుకున్నారు. దేశంలో గత 24 గంటల్లో 23 లక్షల 70 వేల 298 మందికి వ్యాక్సిన్ వేయగా..ఇప్పటివరకూ దేశంలో 16 కోట్ల 49 లక్షల 73 వేల మంది వ్యాక్సిన్ ( Vaccination)వేయించుకున్నారు. ఇక దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల ( Covid19 Tests)సామర్ధ్యం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 18 లక్షల 26 వేల శాంపిల్స్ పరీక్షించారు.


Also read: Remdesivir injections: రెమ్‌డెసివిర్ ఉత్పత్తికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు అనుమతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook