Covid Cases: దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు..ఫోర్త్ వేవ్ వచ్చేసినట్టేనా?
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. గత గత 24 గంటల్లో దేశంలో 17 వేల 073 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. గత గత 24 గంటల్లో దేశంలో 17 వేల 073 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం శనివారం 11 వేల 739 కేసులు నమోదు కాగా.. నిన్న అంతకంటే దాదాపు 6 వేల కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. గడచిన 24 గంటల్లో 21 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 25 వేల 020కి పెరిగింది.
గత 24 గంటల్లో కొవిడ్ నుంచి 15, 208 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 94 వేల 420కి చేరింది. గత ఐదు నెలల్లో ఇది గరిష్టం. దేశంలో రికవరీ రేటు 98.57 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 0.22 శాతానికి పెరిగింది. దేశంలో పాజిటివిటి రేట్ ప్రమాదకరంగా పెరుగుతోంది. రోజువారి పాజిటివిటి రేట్ 4 .3 శాతం దాటింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు దరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. నిన్న 2 లక్షల 49 వేల 646 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 197 కోట్ల 11 లక్షల 91 వేల 329 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
Also Read: IRE vs IND 1st T20: హుడా మెరుపు ఇన్నింగ్స్.. ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం!
Also Read: Horoscope Today June 27 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల విద్యార్థులకు శుభకాలం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి