Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు నమోదవుతున్నా.. హాస్పిటల్ చేరాల్సిన అవసరం ఎక్కువ మందికి రావడం లేదు. కాని వారం రోజులుగా కొవిడ్ మరణాలు పెరిగిపోతున్నాయి. ఇదే ఇప్పుడు వైద్య వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో గత 24 గంటల్లో దేశంలో 14 వేల 506 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే కొవిడ్ కేసులు దాదాపు  6 వేలు పెరిగాయి. గడచిన 24 గంటల్లో మరో 27 మంది కొవిడ్ తో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 25 వేల 077కి పెరిగింది. గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో  11 వేల 574 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువైంది.  కేంద్ర ఆరోగ్యశాఖ రిపోర్ట్ ప్రకారం కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 99 వేల 602కు పెరిగింది. దేశంలో రికవరీ రేటు 98.56 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 0.23 శాతానికి పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. నిన్న  13 లక్షల 44 వేల 788 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 197 కోట్ల 46 లక్షల 57 వేల 138 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.



Read also: Dil Raju Son: మరోసారి తండ్రైన దిల్ రాజు.. వారసుడు వచ్చేశాడుగా


Read also: TS Inter Results 2022: ఇతర సబ్జెక్టుల్లో టాప్ మార్కులు.. ఒక సబ్జెక్టులో జీరో! షాకవుతున్న విద్యార్థులు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి