Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో నిన్నటితో పోల్చితే ఇవాళ కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో 16 వేల 159 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే దాదాపు 3 వేల కేసులు పెరిగాయి. కొవిడ్ సోకిన మరో 28 మంది చనిపోయారు. తాజా మృతులతో  దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 25 వేల 270కి పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. చెన్నైలో కొవిడ్ విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో  15 వేల 394 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా పదిహేను వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.53 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 0.26 శాతానికి పెరిగింది. పాజిటివిట్ రేటు గతం వారం రోజులుగా తగ్గగా.. తాజా మళ్లీ పెరిగింది. ప్రస్తుతం పాజిటివిటి రేట్ 3.56 శాతంగా ఉంది.



దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న మరో 9 లక్షల 95 వేల 810 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 198 కోట్ల 20 లక్షల 21 వేల 763 మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 


Read also: GAS PRICE HIKE: సామాన్యులకు మరో షాక్.. 50 రూపాయలు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర


Read also: AP Schools: నాడు- నేడు అంటే ఇదేనా.. ఏపీలో 8 వేల ప్రభుత్వ స్కూళ్లు మాయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook