Covid 19 Updates : దేశంలో కొవిడ్ కల్లోలం కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లో అత్యంత ప్రమాదకరంగా పెరిగిపోతోంది. దేశంలో గత 24 గంట్లో 16 వేల 299 మందికి కొవిడ్ నిర్దారణ అయింది. నిన్న మొత్తం 3 లక్షల 56 వేల మందికి  వైద్య పరీక్షలు చేశారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.58 శాతంగా ఉంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కొవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్ని రోజులుగా ఢిల్లీలో రోజుకు రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఢిల్లీలో పాజిటివిటీ రేట్ 17.83 శాతంగా ఉంది. ఇది అత్యంత ప్రమాకరమని వైద్య వర్గాలు చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 25 వేలుగా ఉంది.  గత 24 గంటల వ్యవధిలో 19 వేల 431 మంది కొవిడ్ నుంచి  కోలుకున్నారు. కొన్ని రోజులుగా కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. దేశంలో  ఇప్పటివరకూ మొతతం 4.42 కోట్ల మందికి కోవిడ్ సోకింది. రికవరీ 98.53 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కొవిడ్ భారీన పడిన మరో 53 మంది చనిపోయారు. ఢిల్లీలో నిన్న ఎనిమిది మంది చనిపోయారు. గత ఆరు నెలల కాలంలో ఒక్కరోజు ఎక్కువ మరణాలు సంభవించడం ఇదే. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్థిరంగా కొనసాగుతోంది. నిన్న మరో 25 లక్షల 75 వేల మందికి వ్యాక్సిన్లు వేశారు. దీంతో ఇప్పటివరకూ దేశంలో 207 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ పూర్తైంది. 



Read also: Shilpa Shetty: షూటింగ్లో ప్రమాదం.. కాలు విరగ్గొట్టుకున్న శిల్పా శెట్టి!


Read also: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook