Covid Cases: నిన్నటికంటే తగ్గిన కొవిడ్ కేసులు.. పెరిగిన మరణాలు! కొత్తగా ఎన్ని వచ్చాయంటే...
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కొత్త కేసులు కొస్త తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16 వేల 935 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కొత్త కేసులు కొస్త తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16 వేల 935 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 51 మంది చనిపోయారు. తాజా మృతులతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 25 వేల 760కి పెరిగింది.
గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో 16 వేల 069 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 44 వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతానికి పెరిగింది. పాజిటివిట్ రేటు 4.48శాతంగా ఉంది. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ మరో మైలురాయిని సాధించింది. దేశంలో వ్యాక్సినేషన్ 200 కోట్ల మార్క్ దాటింది. నిన్న మరో 4 లక్షల 46 వేల 760 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 200 కోట్ల 4 లక్షల 61 వేల 095 మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
Read also: TS EAMCET 2022: నేడు తెలంగాణ ఎంసెట్.. వర్షాలతో ప్రత్యేక ఏర్పాట్లు... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
Read also: Cloud Busrt: క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ? ఆకస్మిక వరదలు స్పష్టించడం సాధ్యమా? గోదావరిపై కుట్ర జరిగిందా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.