Covid Cases: దేశంలో మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. మరో మూడు వారాలు డేంజరే?
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి ప్రమాదకరంగానే కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే కేసులు మళ్లీ పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో దేశంలో 17 వేల 092 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మరో 29 మంది కొవిడ్ తో మృతి చెందారు.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి ప్రమాదకరంగానే కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే కేసులు మళ్లీ పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో దేశంలో 17 వేల 092 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మరో 29 మంది కొవిడ్ తో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 25 వేల 168కి పెరిగింది.
గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో 14 వేల 684 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా తొమ్మిది వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 0.25 శాతానికి పెరిగింది. దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. నిన్న మరో 9 లక్షల 9 వేల 776 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 197 కోట్ల 84 లక్షల 80 వేల 41 మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మరో మూడు వారాల పాటు కొవిడ్ కేసుల తీవ్రత ఉంటుందని , ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read also: CPI Narayana: ప్రధాని మోదీ మేకప్ ఖర్చు నెలకు రూ.70 లక్షలు... సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు...
Read also: Traffic Alert: హైదరాబాదీలకు అలర్ట్.. ఈ రెండు రోజులు అటు వైపు వెళ్లకండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook