Covid Cases Updates: భారత్ లో కొవిడ్ కల్లోలం.. ఒక్కరోజే 17 వేలకు పైగా కేసులు.. లాక్ డౌన్ తప్పదా?
Covid Cases Updates: దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. అత్యంత ప్రమాదకరంగా విజృంభిస్తోంది. రోజువారి కేసులు 17 వేలకు పైగా నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17 వేల 336 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకిన మరో 13 మంది చనిపోయారు. రోజువారి కేసులు నాలుగు నెలల తర్వాత 17 వేలు దాటాయి
Covid Cases Updates: దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. అత్యంత ప్రమాదకరంగా విజృంభిస్తోంది. రోజువారి కేసులు 17 వేలకు పైగా నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17 వేల 336 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకిన మరో 13 మంది చనిపోయారు. రోజువారి కేసులు నాలుగు నెలల తర్వాత 17 వేలు దాటాయి. కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి కొవిడ్ కేసులు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణలోనూ కొవిడ్ కేసుల సంఖ్య 5 వందలకు చేరువలో ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 496 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గత జనవరి తర్వాత ఇదే అత్యధికం.
కొవిడ్ నుంచి గత 24 గంటల్లో 13 వేల 29 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు వైరస్ ను జయించిన వారి సంఖ్య 4 కోట్ల 27 లక్షలకు పైగానే ఉంది. రికవరీ రేటు 98. 59శాతంగా ఉంది. రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరగుతుండటంతో యాక్టివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 88 వేల 284 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల కేసుల సంఖ్య 0.20 శాతానికి పెరిగింది.దేశంలో పాజిటివిటి రేట్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. రోజువారి పాజిటివిటి రేట్ 4 శాతం దాటడంతో వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం పాజిటివిటి రేట్ 4.32 శాతంగా ఉంది.
Read also: Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో ప్రకాష్ రాజ్ చర్చలు.. కేసీఆర్ కొత్త పార్టీ గురించేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.