India Reports 2288 fresh Covid 19 cases in past 24 hours: కరోనా వైరస్ పీడ విరగడైపోతుందనుకునే లోపే.. మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూపిస్తోన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా  ప్రతిరోజూ భారత్‌లో మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గడిచిన 3-4 రోజులుగా దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల ఊరట కలిగిస్తోంది. ఈరోజు (మే 10) 2,288 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇది దేశ ప్రజలకు ఓ శుభవార్త అనే చెప్పాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం 4.84 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,288 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 3,044 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం కొత్త కేసులు కంటే.. రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. ప్రస్తుతం దేశంలో ఆక్టివ్ కేసులు 20 వేల లోపునకు (19,637) చేరాయి. 



ఇప్పటివరకూ దేశంలో 4.31 కోట్ల మందికి కరోనా మహమ్మారి సోకగా.. అందులో 98.74 శాతం (42563949) మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల రేటు 0.05 శాతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ దేశంలో 5.24 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకు దేశంలో 1,90,50,86,706 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. సోమావారం (మే 10) 13,90,912 మంది వ్యాక్సినేషన్‌ వేయించుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: iPhone 14 Max Price: ఐఫోన్ 14 మాక్స్ ధర లీక్.. ఎంతో తెలిస్తే షాకే! స్పెసిఫికేషన్‌లు ఇవే


Also Read: Sonakshi Sinha Engagement: వైరల్ ఫొటోస్.. ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో సోనాక్షి సిన్హా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook