India Corona Update: దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం..19.59 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు..
India Corona Update: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరింది.
India Corona Cases: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,384 కరోనా కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. వైరస్‌తో మరో 573 మంది మరణించారు. 3,06,357 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,03,71,500 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,91,700 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 22,02,472 యాక్టివ్ కేసులు (Corona Active cases in India) ఉన్నాయి. మరోవైపు 3,76,77,328 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 22,35,267 డోసులు (Vaccination) అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,84,39,207కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 35,22,726 మందికి (corona cases in world) కరోనా సోకింది. 10,652 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 36,29,39,500కి చేరగా.. మరణాల సంఖ్య 56,45,188కు పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.