Covid 19 Cases Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఫోర్త్ వేవ్‌కి సంకేతమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఫోర్త్ వేవ్ మొదలైందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3303 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,68,799కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,980 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.4శాతంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 39 మంది మృతి చెందారు. ఒక్క కేరళలోనే 26 మంది మృతి చెందడం గమనార్హం. ఈ మరణాలతో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 5,23,693కి చేరింది. కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. 


కోవిడ్ కేసుల సంఖ్య పెరగడంతో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఫోర్త్ వేవ్ భయాల నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు సూచించారు. బుధవారం (ఏప్రిల్ 27) రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమీక్షా సమావేశంలో మోదీ పలు కీలక సూచనలు చేశారు. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఇతర దేశాల కన్నా భారత్ సమర్థవంతంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.


రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలన్నారు. కోవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని... చిన్న పిల్లల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. కోవిడ్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. 


Also Read: Chiranjeevi Acharya: పవన్ కల్యాణ్ కోసం 'ఆచార్య' మూవీ స్పెషల్ స్క్రీనింగ్...


Also Read: బ్లేమ్ గేమ్.. మోదీకి కేటీఆర్ కౌంటర్... ఆ పనిచేస్తే రూ.70కే లీటర్ పెట్రోల్ ఇవ్వొచ్చునని సలహా...  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook