India Corona update: దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది.  కేంద్ర ఆరోగ్యశాఖ (The Union Minister for Health & Family Welfare) గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరిగాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,73,757 కరోనా టెస్టులు చేయగా 36,401 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ముందు రోజుతో పోలిస్తే, 3.4 శాతం కరోనా కేసులు పెరిగాయని, 530 మంది వైరస్ భారిన పడి చనిపోయారని  కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Jr NTR: హాట్ టాఫిక్ గా ఎన్టీఆర్ ఖరీదైన కారు...దేశంలో తొలి వ్యక్తిగా రికార్డు
మన దేశంలో ఇప్పటివరకు 50,03,00,840  టెస్టులు చేయగా,  24 గంటల వ్యవధిలో 36,401 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 3.23 కోట్లకు చేరగా..ఇప్పటివరకు 4 లక్షల  33 వేల 39 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు. 


ఇదిలా ఉండగా.. గడచిన 24 గంటల్లో 39,157 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోగా, రికవరీ రేటు 97.52 శాతానికి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కొవిడ్ -19 (Covid-19)వల్ల మొత్తం  433,049 మంది మరణించగా, 31,525,080 మంది కరోనా నుండి కోలుకున్నారు. 
కేరళలో కరోనా మహమ్మారి వ్యాప్తి అధికంగా కనపడుతుంది. గడచిన 24 గంటల్లో కేరళలో (Kerala) 21,427  కొత్త కరోనా కేసులు నమోదవ్వగా 179 మంది ప్రాణాలు విడిచారు. మహారాష్ట్రలో (Maharashtra) 5,132  కొత్త కేసులు నమోదు అయ్యాయి. 


Also Read: katrina kaif secret engagement: విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ సీక్రెట్ ఎంగేజ్మెంట్ రూమర్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook