India Covid: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు...ఒక్క కేరళలోనే 30వేలకుపైగా ..
India Covid: ఇండియాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 41,965 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. దేశవ్యాప్తంగా వైరస్ తో 460 మంది చనిపోయారు.
Corona: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. మంగళవారం తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 41,965 కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే, ఇందులో రెండొంతులకు పైన కేసులు ఒక్క కేరళలోనే నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. ఆ రాష్ట్రంలో 30,203 కేసులు బయటపడ్డాయి.
తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల(Corona Cases) సంఖ్య 3.28కోట్లు దాటింది. ఇక 24 గంటల వ్యవధిలో 33,964 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3.19కోట్ల మందికి పైనే కరోనా(Covid)ను జయించగా.. రికవరీ రేటు 97.51శాతానికి చేరింది. మరోవైపు నిన్న మరో 460 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 115 మరణాలు ఒక్క కేరళ(Kerala)లోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 4,39,020 మందిని కరోనా పొట్టనబెట్టుకుంది. కొత్త కేసులు పెరగడంతో క్రియాశీల కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,78,181 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.15శాతంగా ఉంది.
ఒక్కరోజే 1.33కోట్ల డోసుల పంపిణీ
టీకా పంపిణీ(Vaccine Distribution)లో భారత్ మరోసారి రికార్డు సృష్టించింది. ఆగస్టు 27న తొలిసారి 24గంటల్లో కోటి డోసులకు పైగా పంపిణీ చేయగా.. నిన్న ఆ రికార్డును తిరగరాసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 1.33కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 65.41 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు 50కోట్ల మందికి తొలి డోసు(First Dose) పూర్తిచేయడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook