India Corona Cases: ఇండియాలో మళ్లీ పెరిగిన కోవిడ్19 మరణాలు, వ్యాక్సినేషన్ మరింత వేగవంతం
India Corona Cases: కోవిడ్19 టీకాలు తీసుకోవడం ద్వారా కరోనాకు చెక్ పెట్టవచ్చునని, కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ పరివర్తనం చెందితే త్వరగా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
India Corona Cases: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండగా కరోనా థర్డ్ వేవ్ గురించి చర్చ జరుగుతోంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ పరివర్తనం చెందితే త్వరగా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో కోవిడ్19 టీకాలు తీసుకోవడం ద్వారా కరోనాకు చెక్ పెట్టవచ్చునని, కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు.
ఇండియాలో నేటి ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,393 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపితే దేశంలోని మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,07,52,950కు (3 కోట్ల 7 లక్షల 52 వేల 950)కు చేరుకుంది. డెల్టా వేరియంట్ కోవిడ్ కేసులు (COVID-19 Delta Variant) నమోదవుతున్నాయి. కరోనా మరణాలు నిన్నటితో పోల్చితే పెరిగాయి. నిన్న ఒక్కరోజులో 911 మందిని కరోనా బలిగొంది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్19 మరణాల సంఖ్య 4,05,939 (4 లక్షల 5 వేల 939)కు చేరుకుంది. భారత్‌లో గత ఏడాది నుంచి ఇప్పటివరకూ 36 కోట్ల 89 లక్షల 91 వేల 222 డోసుల కరోనా టీకాల ప్రక్రియ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: Bharat Biotech: కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ఫలితాలు విడుదల చేసిన WHO చీఫ్ సైంటిస్ట్
దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 44,459 మంది కరోనా మహమ్మారిని జయించగా, ఇండియాలో ఇప్పటివరకూ కోవిడ్19 (Covid-19) బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,98,88,284 (2 కోట్ల 98 లక్షల 88 వేల 284)కు చేరుకుంది. ఇండియాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,05,939 (4 లక్షల 5 వేల 939)కు దిగొచ్చింది. జనవరి నుంచి ఇప్పటివరకూ వ్యాక్సినేషన్ 36,89,91,222 (36 కోట్ల 89 లక్షల 91 వేల 222) డోసులు పూర్తయినట్లు పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజులో 40,23,173 (40 లక్షల 23 వేల 173) కరోనా టీకాలు ఇచ్చారు.
Also Read: Telangana COVID-19 updates: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులపై లేటెస్ట్ అప్‌డేట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook