India COVID-19 Cases: ఇండియాలో మరోసారి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, భారీగా పెరిగిన రికవరీ రేటు
India COVID-19 cases: దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్నటితో పోల్చితే 8 వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. భారత్‌లో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,951 మంది కరోనా బారిన పడ్డారు.
India COVID-19 cases: ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెరిగాయి. నిన్నటితో పోల్చితే 8 వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. భారత్‌లో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,951 మంది కరోనా బారిన పడ్డారు. మరోవైపు దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి.
తాజా కేసులతో కలిపితే ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,62,848కు (30 కోట్ల 3 లక్షల 62 వేల 848)కు చేరుకుంది. కోవిడ్19 మరణాలు వరుసగా రెండోరోజు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారితో పోరాడుతూ 817 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం కోవిడ్19 మరణాల సంఖ్య 3,98,454 (3 లక్షల 98 వేల 454)కు పెరిగింది. గడిచన 24 గంటల్లో 60,729 మంది కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి బారి నుంచి కోలుకోగా, ఇండియాలో ఇప్పటివరకూ 2,94,27,330 (2 కోట్ల 94 లక్షల 27 వేల 330) మంది కరోనా విజేతలయ్యారు.
Also Read: Covaxin: ఆ రెండు Covid-19 వేరియంట్లపై కోవాగ్జిన్ మెరుగైన ఫలితాలు, అధ్యయనంలో వెల్లడి
దేశంలో యాక్టివ్ కేసులు నిన్నటితో పోల్చితే తగ్గాయి. బుధవారం ఉదయం 8 గంటల నాటికి దేశంలో 5,37,064 యాక్టివ్ కరోనా కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇండియాలో కరోనా (Covid-19) రికవరీ రేటు 96.92 శాతానికి చేరుకుంది. కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా కంటే దేశంలోనే అత్యధిక డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ అయింది. మరోవైపు పలు రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను మొదలుపెట్టాయి. తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook