Covid 19 Today: ప్రమాదకరంగా పాజిటివిటీ రేట్.. 50 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు.. దేశంలో కొవిడ్ కల్లోలం తప్పదా?
Covid in India: దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు 8 వేలకు పైగానా కొత్త కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 8 వేల 84 మంది వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Covid in India: దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు 8 వేలకు పైగానా కొత్త కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 8 వేల 84 మంది వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రికవరీలు తగ్గడం.. కొత్త కేసులు పెరగడంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రికవరీ రేటు 98.68 శాతంగా ఉండగా.. డెత్ రేట్ 1.21 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతానికి చేరడం వైద్య వర్గాలను కలవరపరుస్తోంది.
నిన్న నమోదైన కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువగా ఉంది. దేశంలో యాక్టివ్ కేసులు 0.11 శాతానికి చేరాయి. గత 24 గంటల్లో వైరస్ నుంచి 4 వేల 529 మంది కోలుకున్నారు. ఆదివారం మరో 10 మంది కరోనా బాధితులు చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5 లక్షల 24 వేల 771 కు పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2 వేల 946 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 కొత్త కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read also: KCR NEW PARTY: ఉండవల్లికి బీఆర్ఎస్ పార్టీ ఏపీ బాధ్యతలు? పీకే డైరెక్షన్ లో కేసీఆర్ స్కెచ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి