Corona cases in India: దేశంలో మళ్లీ లక్షకు చేరువలో యాక్టివ్ కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,216 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. మొత్తం 11,57,156 శాంపిళ్లను టెస్టు చేయగా ఈ కేసులు బయపడ్డట్లు తెలిపింది.
India corona Update: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,216 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. మొత్తం 11,57,156 శాంపిళ్లను టెస్టు చేయగా ఈ కేసులు బయపడ్డట్లు తెలిపింది.
ఇదే సమయంలో కొవిడ్ కారణంగా మరో 391 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 8,612 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
మరిన్ని వివరాలు..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 99,976 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.29 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,70,115 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్ మరణాల రేటు 1.36 శాతంగా ఉంది.
ఇప్పటి వరకు దేశంలో 34,61,5,757 మందికి కరోనా సోకగా.. అందులో 3,40,45,666 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది.
వ్యాక్సినేషన్ ఇలా..
నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 73,67,230 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,25,75,05,514 వద్దకు చేరింది.
దేశంలో కరోనా కేసులు సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నా.. ఒమిక్రాన్ వేరియంట్ భయాలు పెంచుతోంది. ఇప్పటికే రెండు కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ టెస్టు తప్పనిసరి చేశాయి.
అయినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించింది కేంద్రం.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 264,473,438 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,250,054 మంది మహమ్మారికి బలయ్యారు. 238,491,434 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 20,731,950 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.
Also read: COVID-19 vaccine ZyCoV-D : 7 రాష్ట్రాల్లో చిన్నారులకు జైకోవ్-డీ కోవిడ్ వ్యాక్సిన్
Also read: Omicron cases in India: కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు.. కేంద్రం ఏం చెబుతోందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook